Monday, May 6, 2024

TS | 24న సూర్యాపేటకు సీఎం కేసీఆర్‌.. కలెక్టరేట్‌, పలు భవనాలకు ప్రారంభోత్సవాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఈనెల 24న సూర్యాపేట జిల్లా సమీకృత కలెక్టర్‌ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. అదేరోజున ఆయన జిల్లా పోలీస్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయాన్ని కూడా ప్రారంభించండోతపాటు, నూతనంగా నిర్మించిన మెడికల్‌ కాలేజీ భవనాన్ని, ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ను ప్రారంభిచనున్నారు. అనంతరం సూర్యాపేటలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఈ మేరకు అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement