Friday, May 3, 2024

Congress – రేపే సిఎల్పీ నేత ఎన్నిక… ఆ మ‌రుక్ష‌ణ‌మే కొత్త సిఎం ప్రమాణ స్వీకారం

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ (60)ను దాటడమే కాకుండా మరో 4 స్థానాలను అదనంగా గెలిచింది. దీంతో సోమవారం కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక సిఎల్పీ నేత ఎంపిక కోసం రేపు గెలిచిన కాంగ్రెస్ అభ్య‌ర్ధుల స‌మావేశం ఆ పార్టీ ఏర్పాటు చేసింది.. ఎఐసిసి ప‌రిశీల‌కుల స‌మ‌క్షంలో సిఎల్పీ నేత ఎంపిక జ‌ర‌గ‌నుంది.. పార్టీని విజ‌య‌ప‌దం లో న‌డిపిన రేవంత్ రెడ్డి ఆ నేత‌గా ఎన్నిక కావ‌చ్చ‌ని కాంగ్రెస్ వ‌ర్గాలంటున్నాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement