Friday, May 3, 2024

cannabis : కారు బోల్తా… భారీగా గంజాయి ల‌భ్యం

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ సమీపంలో బోల్తాపడిన కారులో భారీగా గంజాయి లభ్యమైంది. శనివారం తెల్లవారుజామున జిల్లాలోని జహీరాబాద్‌ మండలం బూజ్‌నేల్లి సమీపంలో ఓ కారు (TS07EZ 7397) బోల్తా పడింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులో పెద్దమొత్తంలో గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు. క్వింటాలుకుపైగా గంజాయి ఉంటుందని తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత అందులో వచ్చిన వ్యక్తులు కారును అక్కడే వదిలి వెళ్లినట్లు చెప్పారు. దాని విలువ రూ.50 లక్షలకుపైగా ఉంటుందన్నారు. కారు నంబర్‌ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నామని వెల్లడించారు. చుట్టుపక్క ప్రాంతాల్లో స్మగ్లర్ల కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement