Tuesday, July 23, 2024

TS: మణికొండలో కారు బీభత్సం.. మహిళ, బాలుడికి గాయాలు

కారు బీభత్సం సృష్టించిన ఘటనలో మహిళ, బాలుడికి గాయాలు కావడంతో పాటు పలు వాహనాలు ధ్వంసమైన ఘటన హైదరాబాద్ పరిధిలోని మణికొండలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… మణికొండ గోల్డెన్ టెంపుల్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వస్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి గుడి పక్కనే పార్క్ చేసిన బైక్‌లపై నుంచి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పలు బైక్‌ లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.


దీంతో డ్రైవర్ పరారయ్యేందుకు ప్రయత్నించగా కాలనీవాసులు వెంబడించి పట్టుకున్నారు. అనంతరం వారి సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న నార్సింగి పోలీసులు కారును, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక విచారణలో భాగంగా కారును నడిపిన వ్యక్తిని పోలీసులు మైనర్‌గా గుర్తించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement