Monday, March 4, 2024

BRS Party – 70 సీట్లు త‌గ్గ‌కుండా గెలుస్తాం ….ఎగ్జిట్ పోల్స్ చూసి కంగారొద్దు..కెటిఆర్

తెలంగాణ లో ముచ్చ‌ట‌గా మూడో సారి విజ‌యం సాధించి అధికారం చేప‌ట్ట‌డం ఖాయ‌మ‌ని బిఆర్ఎస్ పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు, మంత్రి కెటిఆర్ స్ప‌ష్టం చేశారు.. పోలింగ్ ముగిసిన అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, ఎగ్జిట్ పోల్స్ చూసి కార్య‌క‌ర్తలు కంగారుప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పారు.. తాము 70 సీట్లు పైగా గెలుపు సాధిస్తామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు..

డిసెంబర్ 3న మళ్లీ అధికారం చేపడతామని, ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై కంగారు పడాల్సిన అవసరం లేదని, అదంతా తప్పుల తడక అన్నారు కేటీఆర్. 2018లో వచ్చిన చాలా ఏజెన్సీల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తప్పని తేలాయని, అప్పుడు ఒక్క ఎజెన్సీ మాత్రమే నిజం చెప్పిందన్నారు.. చాలా మంది ఓటింగ్ కోసం క్యూ లైన్లలో వెయిట్ చేస్తున్నారని, కేసీఆరే మళ్లీ సీఎం అవుతారని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇంకా క్యూ లైన్లలో ఓటర్లు వేచి ఉండగా… ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడించడమేంటని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement