Tuesday, June 18, 2024

BRS Party – పెండింగ్‌ స్థానాలకు అభ్యర్థులు దాదాపు ఖరారు… నేడో , రేపో ప్ర‌క‌టించే అవ‌కాశం ..

హైద‌రాబాద్ – బీఆర్‌ఎస్‌ జరుగుతున్న పరిణామాలను అన్ని కోణాల్లో పరిశీలించిన సీఎం కేసీఆర్‌ పెండింగ్‌లో పెట్టిన అసెంబ్లీ స్థానాలకు కూడా అభ్యర్థులు దాదాపు ఖరారు చేశారు. ఆయా నియోజకవర్గాల్లో అసంతృప్తులను బుజ్జగించి బీఆర్‌ఎస్‌ గెలుపు కోసం కృషి చేసేలా అన్ని ఏర్పాట్లు- చేసుకున్నారు. ఇక తరువాయి అభ్యర్థుల పేర్లు ప్రకటిం చడమే మిగిలి ఉంది. పెండింగ్‌లో ఉన్న జనగామ నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నర్సాపూర్‌ అసెంబ్లీ స్థానం నుంచి సునీతా లక్ష్మారెడ్డి, నాంపల్లి స్థానం నుంచి ఆనంద్‌గౌడ్‌, గోషామహల్‌ నుంచి గోవింద్‌ రాటే పేర్లు ప్రకటించే చాన్స్‌ ఉంది. ఇక మల్కాజిగిరి నుంచి బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ- చేయాల్సిన మైనంపల్లి పార్టీ మారడంతో ఆ స్థానానికి కూడా అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. ఈ క్రమంలో మల్కాజిగిరి నుంచి మర్రి రాజశేకర్‌రెడ్డి పేరును అధికారి కంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement