Thursday, April 25, 2024

తెలంగాణలో ప్రతి చేనుకు నీరు .. ప్రతి చేతికి పని – మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

కొత్తకోట: మార్చ్ 26 (ప్రభ న్యూస్): కొత్తకోట మున్సిపాలిటీ మరియు మండలములోని ఏడు గ్రామ పంచాయతీల బి ఆర్ ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం పట్టణ కేంద్రంలోని ఆదివారం బి పి ఆర్ గార్డెన్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కొత్తకోట మున్సిపాలిటీ తో పాటు ఏడు గ్రామాల టిఆర్ఎస్ శ్రేణులు వారి కుటుంబ సభ్యులతో తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలతో కుటుంబ సభ్యులతో దాదాపు ఆరువేల మంది తరలివచ్చారు ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సహపంక్తి భోజనం (వన భోజనం)లో ముఖ్య అతిథిగా మంత్రి నిరంజన్ రెడ్డి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి దంపతులు వడ్డించడంతోపాటు వారి తో కలిసి భోజనం చేశారు. అంతకుముందు కొత్తకోట పట్టణ చౌరస్తాలో బిఆర్ఎస్ పార్టీ జెండాను దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు అనంతరం అక్కడి నుండి బిపిఆర్ గార్డెన్ వరకు ర్యాలీగా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు బయలుదేరి వెళ్లారు.

ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఆకలి కేకలు నుండి అన్నపూర్ణ తెలంగాణ రాష్ట్రంగా సంక్షేమ అభివృద్ధి పథకాలతో ప్రజలతో ఆత్మవిశ్వాసం ఆసరా పింఛన్ తో అవ్వ తాతలకు రైతుబంధు రైతు బీమా తో రైతాంగానికి కల్యాణ లక్ష్మితో ఆడపిల్లలకు సీఎం కేసీఆర్ కిట్టు అమ్మ వడితో గర్భవతులకు సన్నబియ్యం అన్నం గురుకుల పాఠశాలలతో విద్యార్థులలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆత్మవిశ్వాసం నింపారన్నారు తెలంగాణలో ఏ పథకం అమలు చేసిన ప్రజలకు భరోసా ఇచ్చి ధైర్యం నింపడం కోసమే తెలంగాణ వస్తే ఏం వచ్చిందని గుర్తు చేసేందుకు ఈ ఆత్మీయ సమ్మేళనాలు ప్రజలు ఆశించిన దానికన్నా ఊహించిన దానికన్నా ఎక్కువ అభివృద్ధి చేసి చూపించి కళ్ళ ముందు పెట్టమన్నారు గతంలో ఎమ్మెల్యే అంటే ఐదేళ్ల ఒకసారి ఎన్నికల ముందు వచ్చేది తెలంగాణ రాష్ట్రంలో కాలికి బలపం పట్టుకొని ఊరూరు తిరుగుతూ అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్నామన్నారు .
కాలేశ్వరం నిర్మాణం పెండింగ్ ప్రాజెక్టుల పూర్తితో దేశానికి అన్నపూర్ణ గాతెలంగాణ తెలంగాణలో పండిన వరి ధాన్యం కొనడానికి కేంద్రం చేతకాక చేతులెత్తేస్తే పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. కెసిఆర్ మాదిగ ప్రజలకు మేలు కోసం పరితపించిన పని చేసే దార్శని కత కలిగిన నేత సమకాలిన రాజకీయాల్లో లేరన్నారు. కరువుతో తండ్లాడిన తెలంగాణలో నేడు నాట్లు వేయడానికి కూలీలు దొరకని పరిస్థితి వచ్చిందన్నారు. ఎటు చూసినా తెలంగాణ రాష్ట్రం పచ్చబడిందని గత ఎనిమిదేళ్లలో జరిగిన అభివృద్ధి ప్రజలు చూస్తున్నారన్నారు. వారి ఆశీస్సులు టిఆర్ఎస్ పార్టీకే కేసీఆర్ సేవలు దేశానికి రాష్ట్రానికి ఎంతో అవసరం అన్నారు. తెలంగాణ వ్యవసాయ దేశానికి తలమానికంగా అయిందన్నారు. బిజెపి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో కరెంటు సాగు తాగునీటికి కటకట దేశంలో 24 గంటల ఉచిత కరెంటు వ్యవసాయానికి ఇస్తున్న ఏకైక తెలంగాణ రాష్ట్రం అన్నారు. యూపీ లో ఆయిల్ ఇంజన్ల మీద ఆధారపడి రైతులు వ్యవసాయం చేస్తున్నారని. 36 లక్షల ఆయిల్ మోటార్లు రైతులు అక్కడ సొంత నడుపుకుంటున్నారు. దేశంలో తెలంగాణతో దీటుగా నిలిచే రాష్ట్రం మరేది లేదని ఆయన అన్నారు

ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ…. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సంక్షేమ పథకాలు చేయడంలో పేదవారు అయితే చాలు పార్టీ చూడడం లేదని అన్నారు. ప్రధాని మోడీ 2014 నుండి తెలంగాణకు ఏం చేశారని ఆయన అన్నారు. తాను. బాగుండాలి నా దోస్త్ అంబానీ బాగుండాలని అని తప్ప ప్రజల గురించి మంచి చేయాలనే ఆలోచన లేదన్నారు సంవత్సరంకు దేశవ్యాప్తంగా రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు. 9 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారన్నారు నల్లధనం వెనక్కి చేస్తారని ఇప్పటివరకు ఎంతమందికి తెలంగాణలో ఉన్న బిజెపి నాయకులలో ఒక నాయకుడి అకౌంట్లో ఎంత జమ చేసారా నాయకులారా మీరు చూపించగలరా . ఇటీవల బిజెపి ఎమ్మెల్యే రాయిచూర్ లో వాళ్ళ ముఖ్యమంత్రిని ఆత్మీయ సమ్మేళనంలో నేరుగా ప్రశ్నించారు. తెలంగాణ మాదిరిగా రైతుబంధు రైతు భీమా కల్యాణ లక్ష్మి వంటి పథకాలు అమలు చేస్తారా లేక తెలంగాణలో కలపాల అని వారు ప్రశ్నించారని ఆయన గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 70 ఏళ్లలో నియోజకవర్గంలో 68 గ్రామాలకు బీటీ రోడ్డు ఉండగా కేవలం గడిచిన తొమ్మిదేళ్లలో 58 గ్రామాలకు బీటీ రోడ్డు వేయడం జరిగిందని అన్నారు

అనంతరం వివిధ గ్రామాల చెందిన 210 మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్ మున్సిపల్ చైర్ పర్సన్ సుకేషిని ఎంపీపీ గుంత మౌనిక డిసిసిబి డైరెక్టర్ వంశీధర్ రెడ్డి సి డి సి చైర్మన్ చెన్నకేశవరెడ్డి మార్కెట్ చైర్మన్ శ్రావణ్ కుమార్ రెడ్డి మున్సిపల్ వైస్ పర్సన్ జయమ్మ మాజీ జెడ్పిటిసి పి విశ్వేశ్వర్ మార్కెట్ వైస్ చైర్మన్ యాదగిరి డాక్టర్ పి జె బాబు గాడిలా ప్రశాంత్ కొండారెడ్డి మాజీ డిసిసిబి డైరెక్టర్ రావుల సురేంద్రనాథ్ రెడ్డి మాజీ మార్కెట్ చైర్మన్ బాల నారాయణ భీమ్ రెడ్డి కటికే శ్రీనివాస్ జి శంకర్ యాదవ్ కౌన్సిలర్లు రామ్మోహన్ రెడ్డి ఎరుకలి తిరుపతి పద్మ అయ్యన్న సంధ్య రవీందర్ రెడ్డి కొండారెడ్డి రాములు యాదవ్ కో ఆప్షన్ సభ్యులు వసీం వహీద్ అలీ నాయకులు సుభాష్ వినోద్ సాగర్ మహేష్ వికాస్ కిరణ్ వివిధ గ్రామాల బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement