Friday, May 3, 2024

BRS-BSP alliance : బీస్పీకి రెండు సీట్లు కేటాయించిన కేసీఆర్

పార్లమెంట్ ఎన్నికలు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో తెలంగాణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్, బీఎస్‌పీ పొత్తు ఖరారైంది. పొత్తులో భాగంగా బీఆర్ఎస్ 15 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తుండగా.. బీఎస్పీకి రెండు సీట్లు కేటాయించింది. హైదరాబాద్‌, నాగర్ కర్నూలు నియోజకవర్గాల్లో బీఎస్పీ అభ్యర్థులు పోటీ చేయనున్నారు.

కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది. అయితే ఈ పార్లమెంట్ ఎన్నికల్లోనైనా సత్తా చాటాలని భావిస్తోంది. మెుత్తం 17 స్థానాలకు గాను మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగా బహుజన్ సమాజ్ పార్టీ (BSP)తో పొత్తుకు ఓకే చెప్పింది. వారం రోజుల క్రితమే ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదరగా.. సీట్ల షేరింగ్‌పై ఇవాళ క్లారిటీ ఇచ్చారు. నాగర్‌ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement