Sunday, October 6, 2024

TS: అందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి.. బండి సంజయ్

అందరూ ఓటు హక్కు వినియోగించుకోబలని బీజేపీ కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మాట్లాడుతూ… బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలిసి బీజేపీ పార్టీని అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్నారన్నారు. ఆ రెండు పార్టీలపై ప్రజలకు విశ్వాసం లేదన్నారు. వారికి ప్రజలు ఓట్లెయ్యరన్నారు. సామాజిక మాద్యమాల ద్వారా తనపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.


టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌ చేసి ఇంకా తెలంగాణ సెంటిమెంట్ ఏంది ?. తెలంగాణ, ఆంధ్ర ఫీలింగ్‌ తీసుకొచ్చే కేసీఆర్‌ అండ్‌ టీం రెచ్చగొట్టే యత్నం చేస్తోందన్నారు. నాగార్జునసాగర్‌ ఇష్యూ ఇప్పుడే ఎందుకు తెరపైకి వచ్చింది..? తెర వెనుక​ ఎవరున్నారు తెలుసునని.. కేసీఆర్‌వి ఫాల్స్‌ రాజకీయాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement