Monday, April 29, 2024

Power Shock – విద్యుత్ ఘాతంలో బాలుడి మృతి.. ప్రాణం ఖ‌రీదు ల‌క్ష 40వేలుగా పంచాయితీ తీర్మానం …

గద్వాల (ప్రతినిధి) జనవరి 15 (ప్రభ న్యూస్) – జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని దాసరిపల్లి గ్రామంలో సంక్రాంతి పండుగ రోజున విషాయదఛాయలు అలుముకున్నాయి. పొలంలో వెళుతుండగా విద్యుత్ తీగ‌లు త‌గిలి 10 ఏళ్ల బాలుడు మృతి చెందాడు.. వివ‌రాల‌లోకి వెళితే గ్రామానికి చెందిన బోయ మల్లేష్ కిష్టమ్మ ల దంపతుల మొదటి కుమారుడు శివ (10) సంవత్సరాలు స్థానిక గ్రామ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. సోమవారం గ్రామంలోని ఎద్దుము గోవింద్ వారి వ్యవసాయ ఆముదాల పొలంలో నేరేడుపండ్ల కోసమని వెళ్లిన సమయంలో విద్యుత్ వైర్లు నేలపై ఉండటాన్ని గమనించకపోవడంతో బాలుడు శివ గొంతుకు తగలడంతో అక్కడిక్కడే మృతి చెందాడు.. దీంతో బాలుడు తల్లిదండ్రులు మల్లేష్ కిష్టమ్మ లు .తీవ్ర కన్నీటి పర్యంతమయ్యారు.

ఈ పొలంలో చాలా రోజుల నుండి విద్యుత్ వైర్లు నెలపైనే పడి ఉన్నాయని పొలం యజమానులు పట్టించ్చుకోకపోవడం త‌మ‌ అబ్బాయి కరెంట్ షాక్ తో చనిపోయాడని బాలుడు తల్లిదండ్రులు ఆరోపించారు. బాలుడి కుటుంబానికి న్యాయం చేసే దిశగా గ్రామ పెద్దలు, గ్రామస్థులు పొలంలోనే పంచాయతీ చేపట్టారు. బాధితుల ఇరువురి ఒప్పందం మేరకు బాలుడి ప్రాణ ఖరీదు ఒక్క లక్షా నలభై వేలు పొలం యజమానులు బాధిత కుటుంబానికి ఇవ్వాలని గ్రామ పెద్దలు పంచాయతీ తీర్మానం చేశారు. అనంతరం మల్దకల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పోస్ట్ మార్టం నిమిత్థమై బాలుడి మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement