Friday, May 3, 2024

Book Fair – పుస్తక ప్రేమికులకు పండుగ – నేటి నుంచి బుక్ ఎగ్జిబిషన్

36వ హైదరాబాద్‌ జాతీయ పుస్తకాల ప్రదర్శన ఎన్టీఆర్‌ స్టేడియంలో నేటి నుంచి కొలువుదీరనున్నది. లక్షలాదిగా పుస్తక ప్రేమికులు తరలొచ్చే ఈ బుక్‌ ఫెయిర్‌లో 365 స్టాల్స్‌ ఏర్పాటు చేస్తున్నట్టు హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ అధ్యక్షుడు జూలూరు గౌరీ శంకర్‌ తెలిపారు. ఎన్టీఆర్‌ స్టేడియంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పుస్తక ప్రదర్శన సాయంత్రం 5 గంటలకు ఎక్సైజ్‌, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభిస్తారని తెలిపారు..

ఆత్మీయ అతిథులుగా సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి శైలజారామ్‌ అయ్యర్‌, విశ్రాంత సుప్రీం కోర్టు న్యాయమూర్తి సుదర్శన్‌ రెడ్డి, రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, పద్మశ్రీ కూరెళ్ల విఠలాచార్య, తెలంగాణ సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ, విమలాగద్దర్‌ పాల్గొంటారని తెలిపారు. జ్ఞాన తెలంగాణ నిర్మాణానికి పుస్తక ప్రదర్శనలను సాధనాలుగా తయారు చేస్తున్నామని తెలిపారు. ప్రతీ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు పుస్తక ప్రదర్శన ఉంటుందని చెప్పారు. శని, ఆదివారాల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుందని తెలిపారు. ఈ పుస్తక ప్రదర్శన ప్రాంగణానికి ప్రజాయుద్ధనౌక గద్దర్‌ పేరును, వేదికకు సంస్కృతం పండితుడు రవ్వా శ్రీహరి పేర్లను నామకరణం చేస్తున్నట్టు చెప్పారు

Advertisement

తాజా వార్తలు

Advertisement