Saturday, April 27, 2024

BJP’s Dhanpal – ఇందూరుకు సేవ చేసే భాగ్యం ప్రజలు కల్పించాలి

నిజామాబాద్ సిటి ,నవంబర్ (ప్రభన్యూస్)28: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రధాని మోడీ సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టాడని అభివృద్ధి మా నినాదమని బిజెపి అర్బన్ అభ్యర్థి దన్పాల్ సూర్యనా రాయణ అన్నారు మీకు అండగా నేనుంటా.. ఇందూరు ప్రజలు సేవ చేసే భాగ్యం కల్పించాలని బీజేపీ అభ్యర్థి ధన్ పాల్ సూర్యనారా యణ అన్నారు.

మంగళవారం నిజామాబాదు నగరం లోని బీజేపీ నాయకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు నిజామా బాదు నగర పుర విధుల్లో భారీ ర్యాలీ తీశారు.ఈ సందర్బంగా ధన్ పాల్ మాట్లా డుతూ ఇందూరు ప్రజలకు పాదాభివందనం చేస్తున్న నన్ను గెల్పిస్తే కబ్జాలు, కమిషన్ లు ఉండవన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త ను కాపాడాకుంటాను అన్నారు. మా జోలికి వస్తే బాగుండదు.. అని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు పేదల సమస్యలు తీర్చలేని నాయ కులు మనకు అవసరమా? అన్నారు నగరాన్ని 9 సంవత్సరాలనుండి అర్బన్ నియోజకవర్గం లో ఎంతో మందికి బాధ పెట్టినా వాళ్ళ ఉసురు తగుల్తదన్నారు.మీ కమిషన్ లు కబ్జాలు ప్రజలు ఎవరు మర్చిపోలేదన్నారు. నేను మీ కుటుంబ సభ్యుడిగా అన్ని విధాలుగా పిలుస్తే వచ్చేవాడిని అన్నారు. కార్యకర్తలు ఎవరు ఆదైర్య పడద్దు అన్నారు. నా వెంట నిలబడి ఇన్నిరోజులు ప్రచార కార్యక్రమం లో బూత్ స్థాయిలో పనిచేసిన నా కార్యకర్తలకి ధన్యవాదాలు తెలిపారు.

ఇందూరు ప్రజలు 30 వ తేదీన కమలం జెండా పైన ఓటయాలన్నారు. బి, ఆర్ ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల కు డిపాసిట్ రావద్దు అన్నారు. నేను మీ కోసం మీ సమస్యల పరిష్కారం కోసం ఏన్నో ఏండ్లు గా పోరా టం చేశాను అన్నారుn ఒక్కసారి నగర ప్రజలు ఆలోచ న చేయాలి సామజిక సేవ కార్యక్రమాలు చేస్తూ నిత్యం ప్రజల్లో ఉన్నానని అన్నారు. కెసిఆర్ పాలనా కు చరమ గీతం పాడాలని అన్నారు ఉద్యోగులు, యువకులు, అన్ని వర్గాల ప్రజలు ప్రతి ఒక్కరు మీ అమూల్యమైన ఓటు కమలం గుర్తు కు వేయాలని కోరారు.

ఈ సందర్బంగా జిల్లా బీజేపీ అధ్యక్షులు బస్వా లక్ష్మి నరస య్య మాట్లాడుతూ నగరం లో ధన్ పాల్ సూర్యనారాయణ ని భారీ మెజార్టీ తో గెల్పించాలని అన్నారు. సేవ కార్యక్రమాలు చేస్తూ నిత్యం ప్రజలకు అందు బాటులో ఉంటాడన్నారు. ఈ ఎన్నికలలో బీజేపీ కి అవకాశం ఇచ్చి సూర్యనారాయణ ని భారీ మెజార్టీ తో గెల్పించి మోదీ కి బహుమతి ఇద్దామ న్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమం లో అసంబ్లీ కన్వీనర్ పంచారెడ్డి లింగం, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గోపిడి స్రవంతి రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాలం రాజు, ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మి నారాయణ,కార్పొరేటర్లు పంచారెడ్డి ప్రవళిక శ్రీధర్, మాస్టర్ శంకర్, చందుపట్ల వనిత శ్రీనివాస్, సుక్క మధు,మెట్టు విజయ్, పంచారెడ్డి లావణ్య, ఎర్రం సుదీర్, బంటు వైష్ణవి, బూరుగుల ఇందిరా వినోద్,ఇప్పకాయల సుమిత్ర కిషోర్,బీజేపీ మండల అధ్యక్షులు పుట్ట వీరేందర్, రోషన్ లాల్ బోర, గడ్డం రాజు, బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున యువకులు, ఇందూరు ప్రజలు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement