Saturday, May 25, 2024

BJP Dharna – అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాల్సిందే – డికె అరుణ

జోగులాంబ గద్వాల (ప్రతినిధి) జులై 24 (ప్రభ న్యూస్) – అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ తో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆధ్వర్యంలో గద్వాల జిల్లా కేంద్రంలో వైఎస్సార్ చౌక్ వద్ద సోమవారం ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ..అర్హులైన ప్రతి ఒక్కరికి రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్ ఇళ్ళు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు పేద ప్రజలకు ఇచ్చిన ఇండ్ల పట్టాలను బీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కొని ఇంతవరకు ఇవ్వలేదని వీలైనంత త్వరలోపేద ప్రజల ఇండ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు సార్లు అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రములో పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, ఖాళీ స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం 5లక్షల రూపాయలు ఇస్తామని ఇవ్వలేదని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పేదరికాన్ని, పేద ప్రజల అవసరాలను అడ్డుపెట్టుకొని మోసం చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు లో డీప్ లు వేసి కొన్ని చోట్ల బీఆర్ఎస్ కార్యకర్తలకే డబల్ బెడ్ రూం ఇళ్ళు మంజూరు చేశారని ఆరోపించారు. పేద ప్రజలకు మోసం చేస్తూ బాధ్యతంగా అమలు చేయవలసిన హామీలను తుంగలోతొక్కి మోసం చేస్తున్నారని విమర్శించారు. అదేవిధంగా నాసిరకంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మాణం చేస్తున్నారని, కొన్ని చోట్ల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు పరిశీలించానని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం గా నిరూపించుకుందని విమర్శించారు. తెలంగాణ ప్రజలు ఆకాంక్షల ను అణిచివేస్తున్నారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు కేసీఆర్ కి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో డీకే అరుణతో పాటు బిజెపి నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, రామచంద్రారెడ్డి, రామాంజనేయులు, బండల వెంకట్ రాములు, బంగి లక్ష్మణ్, బీజేవైఎం నాయకులు మిర్జాపురం వెంకటేశ్వర్ రెడ్డి, పెద్దపల్లి రాజశేఖర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ లు బండల పద్మావతి, టపాలా కృష్ణవేణి రామాంజనేయులు, కౌన్సిలర్లు కబీర్దాస్ అనిత, రజక జయ శ్రీ నరసింహులు, శ్రీనివాస గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement