Thursday, February 22, 2024

డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే అభివృద్ధి పరుగులు పెడ్తుంది – బిజెపి

..అర్బన్ లో అభివృద్ధి కంటే అవినీతి ఎక్కువ…అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ఎందుకు పూర్తి చేయలేదు?ఎమ్మేల్యే బిగాల డబుల్ బెడ్ రూములుఎందుకు ఇవ్వలేదు?అవినీతి తో రాష్టాన్ని బ్రష్టు పట్టించిండ్రు..యువతను నిరుద్యోగులను ఆగం చేసిండు.. కేసీఆర్ధన్పాల్ సూర్యనారాయణ భారీ మెజారిటీతో గెలిపించాలి.. బీజేపీ అభ్యర్థి ధన్ పాల్ సూర్యనారాయణ

నిజామాబాద్ సిటీ, నవంబర్ (ప్రభ న్యూస్)27:కేంద్రంలో,రాష్ట్రం లో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే అభివృద్ధి పరుగులు పెడ్తుందని బిజెపి నాయకురాలు, సినీ నటి కవిత దశరథ్ రాజ్, చీకోటి ప్రవీణ్ లు అన్నారు. గత తొమ్మిది సంవ త్సరాల బిఆర్ఎస్ పాలనలో నిజామాబాద్ అర్బన్ అభివృద్ధి శూన్యమని పేర్కొన్నారు. అభివృద్ధి పనుల పేరిట అవినీ తి జరిగింది కానీ అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. సోమవారం నగరం లో 42 వ డివిజన్ లో,గాంధీ చౌక్ లో మహిళా మోర్చా నాయకులు భారీ ర్యాలీ నిర్వ హించారు. ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటి కవిత హాజరయ్యారు. శివాజీ చౌక్ లో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ కి ముఖ్య అతిథిగా చికోటి ప్రవీణ్ హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లా డుతూ నగరంలో అభివృద్ధి కన్నా అవినీతి ఎక్కువ జరి గిందనీ ఆరోపించారు. కేంద్రం లో మోదీ ప్రభుత్వ పథకాలలో ఒక్క రూపాయి అవినీతి జరగ లేదన్నారు. అవినీతి తో రాష్టా న్ని బ్రష్టు పట్టించారనీ మండి పడ్డారు. నగరం లో బిగాల గణేష్ 9 సంవత్సరాల నుండి ఏమి చేయలేదన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు

నిజాంబాద్ అర్బన్ లో డబల్ బెడ్ రూమ్ లో ప్రజలకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిం చారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి అంటూ కల్లబొల్లి మాటలు చెప్పి నిరుద్యోగులను కేసీఆర్ ఆగం చేసిండ్రు అని ధ్వజమెత్తారు. యువత కు ఉద్యోగ అవకాశలు లేక వేరే దేశా లు ప్రయాణం అవుతున్న ఇక్కడ ఎవరు పట్టించుకోలేదని వాపోయారు ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దారుణం అన్నారు. బీజేపీ ప్రభుత్వం రాగానే ఉచిత విద్య, ఉచిత వైద్యం, అమలు చేస్తాం అన్నారు.

రాష్ట్ర ప్రజలు మార్పు కోరుతున్నారని తెలంగాణలో డబల్ ఇంజన్ సర్కారు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ధన్పాల్ సూర్యనారాయణ రాజకీ యాల్లోకి రాక ముందు నుంచి నిజామాబాద్ అర్బన్ ప్రజలకు ట్రస్టు ఏర్పాటు చేసి ట్రస్టు నుంచి అనేక సేవా కార్యక్ర మాలు చేసిన విషయం మీకు తెలిసిందేనని అన్నారు. సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చిన ధన్పాల్ సూర్యనారా యణకు ఒక్కసారి అవకాశం ఇచ్చి నిజామాబాద్ అర్బన్ ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

సేవే మా పరమావదని సేవ చేయడం ఎంతో సంతృప్తిని ఇస్తుందని బిజెపి అర్బన్ అభ్యర్థి దన్ పాల్ సూర్య నారాయణ అన్నారు.అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించడం నా లక్ష్యం అన్నారు.

ఈ కార్యక్రమం లో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాలం రాజు, ఫ్లో్ర్ లీడర్ గోపిడి స్రవంతి రెడ్డి,అసంబ్లీ కన్వీనర్ పంచారెడ్డి లింగం,ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మి నారాయణ, కార్పొరేటర్లు పంచారెడ్డి ప్రవళిక శ్రీధర్, ఏలేటి సిద్దార్థ్ రెడ్డి,మాస్టర్ శంకర్,ఎర్రం సుదీర్, బూరుగుల ఇందిరా వినోద్,చందుపట్ల వనిత శ్రీనివాస్, మెట్టు విజయ్, సుక్క మధు, ఇప్పకాయల వనిత కిషోర్,బంటు వైష్ణవి రాము,పంచారెడ్డి లావణ్య,మండల అధ్యక్షులు పుట్ట వీరేందర్, గడ్డం రాజు, రోషన్ లాల్ బోర, బీజేపీ నాయకులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement