Friday, October 4, 2024

BJP Call – మ‌త క‌ల్లోలాల‌కు కార‌ణ‌మైన‌ కాంగ్రెస్ ను, అవినీతి కెసిఆర్ ను చిత్తుగా ఓడించండిః కిష‌న్ రెడ్డి

హైద‌రాబాద్ – గాంధీ కుటుంబం వల్లే దేశ విభజన జరిగిందని.. హైదరాబాద్‌లో మత కల్లోలాలకు కాంగ్రెస్సే కారణమన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. హైద‌రాబాద్ బిజెపి కార్యాల‌యంలో ఆయ‌న‌మీడియాతో మాట్లాడుతూ, మజ్లిస్ పార్టీని ఎదుర్కొన్నది బీజేపీ ఒక్కటేనని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మజ్లిస్ గుండాయిజాన్ని బీజేపీ ఎట్టి పరిస్ధితుల్లో సహించదని.. దళిత, బీసీ యువత బీజేపీ వెనుక నిలబడ్డారని ఆయన తెలిపారు. 1969 తెలంగాణ ఉద్యమంలో వందలాది మందిని కాంగ్రెస్ పార్టీ కాల్చి చంపిందని ఆయన దుయ్యబట్టారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో 1200 మంది ఆత్మ బలిదానాలకు కాంగ్రెస్సే కారణమని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు.

మజ్లీస్ పార్టీని పెంచి పోషించింది కాంగ్రెస్ వాళ్లేనని ఆరోపించారు కేంద్ర మంత్రి , తాము గతంలో పాదయాత్రలు చేస్తే ముస్లిం మహిళలు బయటకు వచ్చేవారు కాదని తెలిపారు. కానీ ఇప్పుడు ముస్లిం ఆడబిడ్డలు బీజేపీని ఆదరిస్తున్నారని కిషన్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో డిసెంబర్ 3 తర్వాత బీసీ ముఖ్యమంత్రిని చూస్తారని ఆయన జోస్యం చెప్పారు.

తెలంగాణ ప్రజాస్వామ్యానికి సంబంధించిన పండగ 30వ తేదీన జరగనుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు గెలవాలి, ప్రజాస్వామ్యం గెలవాలని కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. కుటుంబ, అవినీతి పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పనున్నారని.. బీఆర్ఎస్ చేతిలో మరోసారి పడి మోసపోవద్దని ఆయన హితవు పలికారు. బీజేపీని ఆశీర్వదించాలని, కాంగ్రెస్, బీఆర్ఎస్‌లను బహిష్కరించాలని కిషన్ రెడ్డి తెలంగాణ ప్ర‌జ‌ల‌ను కోరారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement