Friday, May 3, 2024

Gold: బంగారం ప్రియుల‌కు భారీ షాక్.. రూ.63వేల‌కు చేరిన‌ గోల్డ్ ధ‌ర‌..

బంగారం ప్రియుల‌కు ఇది షాకింగ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరగడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. 2023 సంవత్సరంలో పసిడి ధర 12శాతం మేర పెరిగింది. 2024లో కూడా గోల్డ్ ధరలు భారీ పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం.. ప్రపంచంలోని అనేక దేశాల్లో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై నెలకొన్న అనిశ్చితి, రాజకీయ ఉద్రిక్తతల కారణమేనని అంచనా వేస్తున్నారు.

అయితే, తాజాగా పెరిగిన ధరలను పరిశీలిస్తే.. ఇవాళ‌ ఉదయం నమోదైన వివరాల ప్రకారం… 10గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.వెయ్యి, 24 క్యారెట్ల బంగారంపై రూ.110 పెరిగింది. దీనికితోడు వెండిధర సైతం పెరిగింది. కిలో వెండిపై రూ. వెయ్యి పెరిగింది. ఇవాళ‌ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖ పట్టణంలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 57,750కు చేరింది. 24క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రూ. 63,000 కి చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement