Tuesday, April 30, 2024

Big Loss – పొన్నాలను బాధ పెట్టారు.. అందుకే పార్టీ వీడారు: వీహెచ్

కాంగ్రెస్ సీనియర్ నేత, టీపీసీసీ మాజీ ఛీప్ పొన్నాల లక్ష్మయ్య పార్టీని వీడటంపై ఆ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు సంచలన కామెంట్స్ చేశారు. పొన్నాల లక్ష్మయ్యను అవమానించారు కాబట్టే రాజీనామా చేశారని అన్నారు. మీడియాతో మాట్లాడిన వీహెచ్.. పొన్నాల రాజీనామాపై తనదైన శైలిలో స్పందించారు. పొన్నాలను బాధ పెట్టారని, జనగామలో ఆయనకు ఇబ్బందులు సృష్టించారని ఆరోపించారు. తన గోడును ఎన్నోసార్లు పీసీసీకి చెప్పుకున్నారని తెలిపారు. పొన్నాల రాజీనామా కాంగ్రెస్ పార్టీకి కచ్చితంగా నష్టాన్నే కలిగిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు వీహెచ్.

Advertisement

తాజా వార్తలు

Advertisement