Friday, May 17, 2024

Bhadrachalam – నిమజ్జనం వేడుకల్లో అపశృతి – బాణాసంచా వల్ల పలు షాపులు దగ్ధం

భద్రాచలం,సెప్టెంబర్ 27 (ప్రభ న్యూస్):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పట్టణంలో నిమజ్జనం వేడుకల్లో అపశృతి దొర్లింది. నిమజ్జనం సందర్భంగా టపాకాయలు పేలుస్తున్న ఓ బృందం వారు కాల్చిన టపాసులు స్థానిక అంబేద్కర్ సెంటర్లో పలు దుకాణాలపై వెళ్ళగా అవి దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానిక ఫైర్ సర్వీస్ వారు సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement