Thursday, May 2, 2024

ఆ స్టూడెంట్స్ కి బెస్ట్ ర్యాంకులు.. ఎవరో తెలుసా..

ప్ర‌భ‌న్యూస్: జాతీయ స్థాయిలో ఐసిఏఆర్‌ పీజీ ఎఐఈఈఎ 2021 ప్రవేశ పరీక్షల్లో తెలంగాణ అటవీ కళాశాల, పరిశోధన సంస్థకు చెందిన ఐదుగురు విద్యార్ధులు ఉత్తమ ర్యాంకులు సాధించారు. వై.మల్లేష్‌ జాతీయ స్థాయిలో 16 ర్యాంక్‌ను సాధించాడు. ఎస్సీ కేటగిరిలో కె.రాజు మొదటి ర్యాంక్‌ సాధించగా, పిడబ్ల్యూడి కేటగిరిలో జి.వైష్ణవి మొదటి ర్యాంక్‌ సాధించింది. ఎస్టీ కేటగిరిలో డి.రాజేశ్వరి రెండవ ర్యాంక్‌, ఎస్సీ కేటగిరిలో ఎ.సుప్రియ రెండవ ర్యాంక్‌ను సాధించారు. ఈ సందర్భంగా అటవీ కళాశాల, పరిశోధన సంస్థ డీన్‌ ప్రియంకా వర్గీస్‌, డిప్యూటీ డైరెక్టర్‌ కె.శ్రీనివాస్‌ ర్యాంకులు సాధించిన విద్యార్ధులను అభినందించారు.

అటవీ కళాశాలను కాంచన్‌ దేవి సందర్శించారు, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అటవీ కళాశాల, పరి శోధన సంస్థకు మంచి గుర్తింపు ఉందని, భవిష్యత్‌లో గొప్ప ఫారెస్ట్రీ విద్యాసంస్థగా రాణించగలదని ఇండియన్‌ ఫారెస్ట్రీ రీసెర్చ్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ (ఎడ్యుకేషన్‌) కాంచన్‌ దేవి అభినందించారు. కళాశాల్లో కొనసాగుతున్న విద్యాబోధన, పరిశోధన తదితర అంశాలపై అధ్యపకులను అడిగి తెలుసుకున్నారు. అలాగే కళాశాల్లో ఉన్న అడ్వాన్స్‌ లాబొరేటరీ, మౌలిక సదుపాయాలు, ప్రపంచ స్థాయి ఫ్యాకల్టి, టీచింగ్‌ మెథడ్స్‌ వంటి అంశాలు అద్భుతంగా ఉన్నాయని ఆమె ప్రశంసించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement