Tuesday, May 7, 2024

TS | డీజీపీ ఆఫీసులో బతుకమ్మ వేడుకలు.. హాజరైన అంజనీ కుమార్

తెలంగాణ‌ డీజీపీ కార్యాలయంలో సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా బతుకమ్మ ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. డీజీపీ కార్యాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ బతుకమ్మ పండగకు డీజీపీ అంజనీ కుమార్, అడిషనల్ డీజీయూ సౌమ్య మిశ్రా, అభిలాష బిస్ట్, సంజయ్ కుమార్ జైన్, ఐ.జి రమేష్ రెడ్డి, ముఖ్య పరిపాలనాధికారి నవాణీత తోసహా పలువురు పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

బతుకమ్మ ఉత్సవాలలో పోలీస్ మహిళా అధికారులతో సహా అన్ని స్థాయిల్లోని మహిళా ఉద్యోగులు అత్యంత ఉత్సాహంతో పాల్గొన్నారు. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో మహిళా ఉద్యోగులు, వారి పిల్లలు, చిన్నారులతో ఒక చోట ఉంచి ఆటపాటలతో సంబరాలు చేసారు. దాండియా, బతుకమ్మ ఆటపాటల మధ్య జరిగిన ఈ బతుకమ్మ ఉత్సవాలలో సచివాలయ ఉన్నతాధికారులు, ఉద్యోగుల సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పలువురు మహిళా అధికారులు బతుకమ్మ పై రాసి, పాడిన కవితలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చిన మున్సిపల్ కారికురాలు నారాయనమ్మ తన పాటలతో ప్రత్యేకంగా నిలిచారు. కాగా, జ్యోతి ప్రజ్వలనతో బతుకమ్మ ఉత్సవాలను ప్రారంభించిన డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ, దేవి నవరాత్రి లతో మహిళలను శక్తి రూపంగా పూజించే గొప్ప సంస్కృతి మనలో ఉందని అన్నారు. పూలనే దేవుడిలా భావిస్తూ బతుకమ్మ ఉత్సవాలు జరపడం కేవలం మన రాష్ట్రంలోనే ఉందని పేర్కొన్నారు. పండగ వాతావరణంలో తీరొక్కపూలతో కలర్ ఫుల్ గా ఈ ఉత్సవాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement