Thursday, May 2, 2024

BREKING NEWS: అంబ‌ర్‌పేట‌లో దారుణం… రైలు కింద‌ప‌డి బాలుడి ఆత్మ‌హ‌త్య

అంబర్ పేటలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు బాలికలపై ప్రేమోన్మాది దాడికి పాల్పడ్డాడు. ఇద్దరికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం నిందితుడు రైలు కింద పడి బలవన్మరణంకు పాల్పడ్డాడు.

త‌న‌ను ప్రేమించాల‌ని ఓ అమ్మాయి వెంట ప‌డ్డాడు. ఆమె ఒప్పుకోక‌పోవ‌డంతో ఆమె పై క‌త్తితో దాడికి య‌త్నించాడు. దానిని అడ్డుకోబోయిన మ‌రో అమ్మాయి పై బాలుడు దాడికి పాల్ప‌డ్డాడు. దీంతో భ‌యాందోళ‌న‌కు గురైన బాలుడు విద్యాన‌గ‌ర్ ద‌గ్గ‌ర రైలు కింద ప‌డి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement