Friday, May 3, 2024

Assembly elections – తెలంగాణాలో నవంబర్ 30వ తేదిన ఎన్నికలు…అయిదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల

న్యూఢిల్లీ – తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. తెలంగాణ, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, మిజోరం రాష్ట్రాలకు శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం నేడు విడుద‌ల చేసింది. తెలంగాణలో నవంబర్ 30వతేదిన ఎన్నికల నిర్వహించనున్నారు.. డిసెంబర్ మూడో తేదిన ఓట్ల లెక్కింపు చేపడతారు..

ఇక మధ్యప్రదేశ్‌లో నవంబర్ 7న పోలింగ్ జరగనుందని వెల్లడించారు. మిజోరంలో నవంబర్ 7న ఓటింగ్ జరగనుంది. చత్తీష్‌గఢ్‌లో 2 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశలో నవంబర్ 7న, రెండవ దశలో నవంబర్ 17న జరగనున్నాయి. రాజస్థాన్‌కి నవంబర్ 23న పోలింగ్ జరగనుండగా డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి..

ఐదు రాష్ట్రాల్లోని మొత్తం 679 నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. నేటి నుంచే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుందని ఈసీ తెలిపింది. తెలంగాణలో 3.17కోట్లు, రాజస్థాన్‌లో 5.25కోట్లు, మధ్యప్రదేశ్‌లో 5.6 కోట్లు, ఛత్తీస్‌గఢ్‌లో 2.03కోట్లు, మిజోరంలో 8.52లక్షల ఓటర్లున్నారు.

కాగా, తెలంగాణ లో మొత్తం 119 నియోజకవర్గాల‌కు, మధ్యప్రదేశ్ లో 230, రాజస్థాన్ లో 200, ఛత్తీస్‌గఢ్ లో 90, మిజోరం లో 40 అసెంబ్లీ స్థానాలను ఎన్నిక‌లు జ‌ర‌గనున్నాయి.. ప్రస్తుతం తెలంగాణలోబిఆర్ఎస్ , మధ్యప్రదేశ్‌లో బిజెపి, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌, మిజోరంలో మిజో నేషనల్ ఫ్రంట్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement