Monday, April 29, 2024

ఆంధ్రప్రభ ఎఫెక్ట్ – కేసముద్రం గిరిజన గురుకుల పాఠశాలలో మరొకరు సస్పెన్షన్


మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలలో సుమారు 16 లక్షల జిసిసి డబ్బులను మరొకరి ఖాతాలోజామ చేసి అవినీతి అక్రమాలకు పాల్పడినందుకు గురుకుల అధికారులు ప్రిన్సిపాల్ తో పాటు జూనియర్ అసిస్టెంట్ లను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దాంతో పాటు పూర్తిస్థాయిలో విచారణ జరిపి నాట్ డిప్యూటీ వార్డెన్ జోష్ణ ప్రమీలను సస్పెండ్ చేస్తూ గురుకుల కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

అసలు 16 లక్షలు వేరే ఖాతాలో జమ కావడానికి వీరే కాక మరో ఇద్దరు వార్డెన్లు కూడా ఉన్నట్లు కేసముద్రం మండలంలో జోరుగా చర్చ కొనసాగుతుంది దీనిపైన పూర్తిస్థాయిలో గురుకుల శాఖ అధికారులు వారి పై విచారణ జరిపినట్లైతే అసలు నిజాలు బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ ఆ ఇద్దరు నాటి వార్డెన్లు తమ యొక్క రాజకీయ పరపతిని ఉపయోగించి తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వాసనీయ సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement