Tuesday, May 21, 2024

Andhra Prabha Effect – ఎరువుల, విత్తన దుకాణాలలో తనిఖీలు…

జైనూర్,జూన్26 (ప్రభన్యూస్) కొమరం భీ0 అసిఫాబాద్ జిల్లా రైతులకు అధిక ధరలకు పత్తి విత్తనాలు విక్రయిస్తున్నారని కథనం ఆదివారం ఆంధ్రప్రభ దినపత్రికలు ప్రచురణ కాగా జైనూర్ మండల వ్యవసాయ అధికారి జాదవ్ పవన్ కుమార్ స్పందించి సోమవారం మండల కేంద్రంలోని బాలాజీ విత్తన, ఎరువుల విక్రయ షాపును పాటు పలు విత్తన ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు.

ఎరువుల దుకాణదారులు రైతులకు డీలర్లు ఎవరైనా పత్తి విత్తనాలు ఎం ఆర్ పీ కంటే ఎక్కువ రేటుకు అమ్మినా లేదా ప్రామాణికత లేని విత్తన ఎరువు , పురుగులమందులు అమ్మిన రైతుల నుండి మండల వ్యవసాయ అధికారి కి కంప్లైంటు ఇచ్చినచో వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హామీ అన్నారు. రైతులకు విత్తనాలు ఎరువులు అమ్మినట్లయితే ఒరిజినల్ రసీదులు ఇవ్వాలని షాపులను సక్రమంగా నిర్వహించాలని నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement