Wednesday, October 16, 2024

ADB: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి.. రామగుండం పోలీస్ కమిషనర్

మంచిర్యాల, ఏప్రిల్ 12(ప్రభ న్యూస్) : యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ ఎం.శ్రీనివాస్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో అధ్వర్యంలో గంజాయి, కల్తీ కల్లు వినియోగం వల్ల జరిగే అనర్థాలపై రూపొందిన వాల్‌ పోస్టర్‌ను శుక్రవారం రామగుండం పోలీస్‌ కమిషనరేట్ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. రాష్ట్రంలో గంజాయితో పాటు కల్తీ కల్లు వినియోగం ద్వారా వ్యక్తులతో పాటు సమాజానికి జరిగే నష్టాన్ని తెలిపే విధంగా రూపొందించిన ఈ వాల్‌ పోస్టర్‌లో గంజాయి, కల్తీ కల్లు విక్రయాలకు పాల్పడితే ఫిర్యాదు చేయాల్సిన టోల్‌ ఫ్రీ నంబర్‌తో ఈ అవగాహన పోస్టర్లను రూపోందించడం జరిగింది.


ఈ సందర్బంగా పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ…. గంజాయికి బానిసలుగా మారి యువత తమ భవిష్యత్తు నాశనం చేసుకొంటుందని, దాని వలన వారి జీవితాలు విచ్చిన్నం కావడంతో పాటు తల్లిదండ్రులు మానసిక క్షోభకు గురైవుతున్నారని, గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రజలందరూ స్వచ్చందంగా ముందుకు వచ్చి గంజాయి, మత్తు పదార్థాల విక్రయాలకు పాల్పడేవారి సమాచారాన్ని ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గొప్యంగా వుంచబడుతాయని, గంజాయి రహిత కమిషనరేట్‌ కోసం అధికారులు, సిబ్బంది కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి.రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, సీసీఆర్బి ఇన్స్పెక్టర్ బుద్దే స్వామి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement