Saturday, May 18, 2024

Indravelli – రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి పని చేస్తాం – డిప్యూటీ సీఎం భట్టి

ధరణి. మూలంగా భూములు కోల్పోయిన గోండు గిరిజనులకు తిరిగి ఆ భూములను అప్పగిస్తామని ఇంద్రవెల్లి సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. పోరాట యోధులు అమరుల, తాడిత పీడితుల ఆలోచనలను ఈ ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. ఇటీవల రెండు కార్యక్రమాలు చేపట్టిందన్నారు..కళాకారులకు అందించే నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులను అందిస్తామని ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారని తెలిపారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తామని ఇంద్రవెల్లి అమరుల స్థూపంగా ప్రమాణం చేశాం.. సభల్లో స్పష్టం చేశామన్నారు.

అధికారంలోకి రాగానే ఇదే అమరుల స్తూపం సాక్షిగా నాగోబా దేవాలయం సాక్షిగా అభివృద్ధి పనులు ప్రారంభించామని తెలిపారు. నేటి ఇంద్రవల్లి సభ సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు అని అన్నారు. కోరి తెచ్చుకున్న తెలంగాణ కొద్దిమంది చేతుల్లో బందీ కాగా.. తాము అధికారంలోకి వస్తే మీ కష్టాలు తీరుస్తాం అని ఇదే ఆదిలాబాద్ జిల్లాలో ప్రకటించామన్నారు. మీ అందరి ఆశీస్సులతో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిందన్నారు. ఇచ్చిన మాట మరవకుండా వంశస్తుల నాగోబా దేవాలయం అభివృద్ధి కార్యక్రమాలతో ఈ రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామన్నారు.

అమరుల స్తూపం సాక్షిగా ఇచ్చిన మాట మేరకు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి పని చేస్తామన్నారు భట్టి విక్రమార్క. గోండుల జీవితాల్లో మార్పు రావాలని తన జీవితాన్ని అంకితం చేసిన గద్దర్ తాను పాదయాత్ర మొదలుపెట్టిన రోజు అమరుల స్తూపం వద్ద గద్దర్ ప్రమాణం చేయించారని గుర్తు చేసుకున్నారు. గోండుల జీవితాల్లో మార్పు కోసం తాను పీపుల్స్ మార్చ్ పేరిట పాదయాత్రను ఇంద్రవెల్లి నుంచే ప్రారంభించిన సంఘటనను భట్టి విక్రమార్క గుర్తు చేసుకున్నారు. ఐటీడీఏల పునరుద్ధరణ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు ఆర్థిక సాయం పెంచడం, త్రివేణి సంగమం అభివృద్ధి చిహ్మాన్ ప్రాజెక్టును పూర్తి చేయాలని నేడు కోరారు. ఈ పనులన్నీటిని పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని.. ఇదే అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారని గుర్తు చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement