Sunday, June 23, 2024

TS : యువకునిపై దాడి

జన్నారం,మార్చి 19( ప్రభ న్యూస్): మంచిర్యాల జిల్లా జన్నారంలో ఓ యువకునిపై 8 మంది యువకులు దాడి చేశారు. ఈ సంఘటన మంగళవారం ఉదయం కలకలం రేపింది. ఓ మహిళ తో వివాహేతర వ్యవహారంలో యువకునిపై 8 మంది యువకులు దాడి చేయగా, ఆ యువకునికి తలుపు దెబ్బలు తగిలి తీవ్రగాయాలతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

జన్నారం మండలం పొనకల్ గాంధీనగర్ కు చెందిన మహర్ అంజన్న , ఇదే గ్రామానికి చెందిన సుందరయ్య కాలనీకి చెందిన ఓ 45 ఏళ్ల మహిళతోతో వివాహేతర వ్యవహారం విషయంలో ఆ మహిళ తమ్ముడు మరో 7 గురితోకలిసి సోమవారం రాత్రి స్థానిక పాత రాజరాజేశ్వర స్కూల్ ఆవరణలో సోమవారం రాత్రి దాడి చేసి తీవ్రంగా కొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు, యువకుని మిత్రులు నేటి ఉదయం తెలిపారు.ఈ దాడిలో యువకునికి తలకు, ఇతర చోట్ల దెబ్బలు తగిలి తీవ్రగాయా అవడంతో, సమాచారం తెలుసుకున్న 108 అంబులెన్స్ స్థానిక పైలెట్ పవన్ గౌడ్,ఈఎంటి జాడి రమేష్ లు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని ఆ యువకునికి ప్రాథమిక చికిత్స అందించి, మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రగాయాలకు గురైన అంజన్న ప్రస్తుతం మంచిర్యాలలోని ప్రభుత్వ సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మంగళవారం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement