Tuesday, October 8, 2024

Vote: ఓటు హ‌క్కును వినియోగించుకున్న సినీన‌టులు

సినీ హీరో వెంకటేశ్‌ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లిహిల్స్‌లోని ఓ పోలింగ్‌ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. జూబ్లిహిల్స్‌లోని పీ ఓబుల్‌రెడ్డి పబ్లిక్‌ స్కూల్‌లో జూనియర్‌ ఎన్టీఆర్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

కుటుంబసభ్యులతో కలిసి ఆయన ఓటు వేశారు. పోలింగ్‌ కేంద్రంలో తల్లి, భార్యతో కలిసి సామాన్యుడిలా క్యూలైన్‌లో నిలబడి ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఓటు వేశారు. జూబ్లీహిల్స్‌ క్లబ్‌లో నటుడు సుమంత్‌ ఓటుహక్కును వినియోగించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement