Friday, May 17, 2024

Peddapalli: కాంగ్రెస్ కు షాక్.. ఒక జెడ్పీటీసీ, ఇద్దరు మాజీ ఎంపీపీల రాజీనామా

రాహుల్ గాంధీ పర్యటనకు ముందే పెద్దపల్లి కాంగ్రెస్ కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. బుధవారం ఓదెల జెడ్పీటీసీ గంటరాములతో పాటు మాజీ ఎంపీపీలు సి.సత్యనారాయణ రెడ్డి, వేముల రామ్మూర్తితో పాటు పెద్ద సంఖ్యలో నాయకులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.

పెద్దపెల్లి జిల్లా కేంద్రానికి రాహుల్ గాంధీ వస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి భారీ సంఖ్యలో నేతలు రాజీనామా చేయడం ఆ పార్టీని కోలుకోలేని దెబ్బతీసింది. పార్టీలో సీనియర్లను గౌరవించే పరిస్థితి లేదని, నియంతృత్వ పోకడ వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆరోపించారు. రేపు మరికొంతమంది ముఖ్య నాయకులు రాజీనామా చేయనున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement