Monday, February 26, 2024

Breaking | చెట్టుకు ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి

తొర్రూర్, (ప్రభన్యూస్) : కారు చెట్టును ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. ఈ ఘటన ఇవ్వాల (శనివారం) ఉదయం మహబుబాబాద్​ జిల్లాలో జరిగింది. దంతలపల్లి మండల కేంద్రంలో ఓ కారు చెట్టును ఢీకొట్టిందని 108 అంబులెన్స్​ సిబ్బంది తెలిపారు. స్థానికుల అందించిన సమాచారం మేరకు 108 అంబులెన్స్​ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఒకరు చనిపోయారు. 108 అంబులెన్స్​లో క్షతగాత్రులను హాస్పటల్ కు తరలిస్తుండా మరొకరు చనిపోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన వారిలో నిర్మల్ జిల్లాకు చెందిన వారున్నట్టు గుర్తించారు. శామీర్, డ్రైవర్ హలీంగా తెలుసుకుని వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కాగా, వీరు నిర్మల్ నుండి ఖమ్మం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement