Wednesday, June 19, 2024

Peddapalli: 6166 మంది రక్త దానం.. ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు

పెద్ద‌ప‌ల్లి : ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు పోలీస్ శాఖ నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో రికార్డు స్థాయిలో 6,166 మంది రక్తదానం చేశారు. సోమవారం పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని ఐటిఐ కళాశాల మైదానంలో పెద్దపెల్లి సబ్ డివిజన్ పోలీసులు ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ప్రారంభించారు.

దేశ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా 6,166 మంది రక్తదానం చేయడంతో ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు పొందింది. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇవి శ్రీనివాస్, పెద్దపల్లి డీసీపీ వైభవ్ గైక్వాడ్, ఏసీపీ ఎడ్ల మహేష్ తో పాటు పెద్ద సంఖ్యలో యువతీ యువకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement