Monday, February 26, 2024

TS: 24గంటల కరెంటా.. మూడు గంటల కరెంట్ కావాలా..? మంత్రి గంగుల

బీఆర్ఎస్ కు ఓటు వేస్తే 24 గంటలు కరెంటు వస్తుందని, కాంగ్రెస్ కు ఓటు వేస్తే మూడు గంటల కరెంటు మాత్రమే వస్తుందని.. ఏది కావాలో ప్రజలే తేల్చుకోవాలని మంత్రి గంగుల కమలాకర్ తెలియజేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ శ్రీరాములు పల్లి గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించి, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని వివరించారు.

అనంతరం మాట్లాడుతూ… భాజాపాకు ఓటు వేస్తే మత రాజకీయాలు చేసి ఘర్షణలు సృష్టిస్తారన్నారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే బీజేపీకి లాభం జరుగుతుందని, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు. గత పదేళ్లలో ఎంతో అభివృద్ధి చేశామని, 30వ తేదీన కారు గుర్తుకు ఓటు వేసి అసెంబ్లీకి పంపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. గతంలో పింఛన్ 200 రూపాయలు ఉండేదని తమ ప్రభుత్వం రెండు వేలు చేసిందని, అధికారంలోకి రాగానే 5000 కు పెంచుతామన్నారు. తెల్లకార్డు గల ప్రతి ఒక్కరికి సన్నబియ్యం అందించడంతో పాటు ఐదు లక్షల బీమా అందిస్తామని, రైతుబంధు 16 వేలకు పెంచుతామని, ఆరోగ్య శ్రీ గరిష్ట పరిమితిని 15 లక్షల రూపాయలకు పెంచుతామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement