Friday, April 26, 2024

11మంది కేయు జాక్ నేతల అరెస్ట్..

కాకతీయ యూనివర్సిటీలో రెండు రోజుల క్రితం ఆందోళన చేసిన కేయూ జాక్ నాయకులను ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పొద్దు పొద్దున్నే తలుపులు పగలగొట్టి మరీ అరెస్టు చేసి, కేయూ పోలీస్ స్టేషన్ కు తరలించారు. 11మంది జాక్ నేతలను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. అరెస్ట్ చేసిన వారిలో ఇట్టబోయిన తిరుపతి యాదవ్, మెడ రంజిత్ కుమార్, కాడపాక రంజిత్, బందిగ రాకేష్ కృష్ణన్, అరేగంటి నాగరాజు, బోట్ల మనోహర్, హెచ్చు భగత్ లతో పాటు మరో నలుగురు ఉన్నారు.

కాకతీయ యూనివర్సిటీలోని వైస్ ఛాన్సలర్ భవనంలోకి చొచ్చుకపోవడానికి ప్రయత్నించగా తోపులాట చోటుచేసుకుంది. అలాగే విద్యార్థి నేతలు పూల కుండీలు, కిటికీ అద్దాలు పగులగొట్టి బీభత్సం సృష్టించారు. పోలీసులను తోసుకుంటూ వీసీ భవనంలోకి వెళ్లేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. ఈవిషయాలపై కేసు నమోదు చేసినట్లు కేయు సిఐ దయాకర్ తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement