Saturday, March 2, 2024

‘మీ రోజులు దగ్గరపడ్డయ్​.. చావుకు రెడీగా ఉండండి’ ‌‌– మాజీ సీఎంల‌తో స‌హా 61 మందికి బెదిరింపు

‘ఇక మీకు మూడింది. అంత్య‌క్రియ‌ల‌కు అందరూ సిద్ధంగా ఉండండి’ అంటూ క‌ర్నాట‌క మాజీ సీఎంలతో స‌హా 61 మందికి గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు బెదిరింపు లేఖలు పంపారు. విప‌క్ష నేత‌, మాజీ సీఎం సిద్ద‌రామ‌య్య‌, జేడీఎస్ నేత‌, మాజీ సీఎం కుమార స్వామి, ర‌చయిత వీర‌భ‌ద్ర‌ప్ప‌తో స‌హా 64 మందికి ఇట్లాంటి బెదిరింపు లేఖ‌లు అందాయి. ఈ విషయం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. దీంతో పోలీసులు కూడా దీన్ని చాలా సీరియ‌స్‌గా తీసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు. అయితే.. తాము మిత‌వాద హిందువుల‌మేన‌ని ఈ లేఖ‌లో వారు స్ప‌ష్టంగా పేర్కొన్నారు. ‘మ‌ర‌ణం మీకు అతి ద‌గ్గ‌ర‌లో ఉంది. వినాశ‌నం అన్న మార్గంలోనే ఉన్నారు. మృత్యువుకు ద‌గ్గ‌ర‌గా ఉన్నారు. మీ అంత్య‌క్రియ‌ల‌కు త‌గిన ఏర్పాట్లు కూడా చేసుకోండి. ఈ విష‌యాన్ని మీ కుటుంబీకులకు తెలియ‌జేయండి’ అని ఆ లేఖ‌లో రాశారు.

కర్నాటకలో పలువురు లీడర్లకు వచ్చిన ఈ బెదిరింపుల‌పై మాజీ సీఎం కుమార స్వామి స్పందించారు. ఈ బెదిరింపుల‌ను ప్ర‌భుత్వం ఏమాత్రం తేలిగ్గా తీసుకోకుండా.. విచార‌ణ చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు. ఇంత జ‌రుగుతున్నా ప్ర‌భుత్వం మౌనంగా ఉండ‌డం ఏమాత్రం బాగోలేద‌ని ఇత‌రులు మండిప‌డుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement