Friday, May 3, 2024

Exclusive | ట్విట్టర్‌లో వీడియో కాల్, కొత్త ఫీచర్లు: సీఈవో లిండా యుకారినో

ట్విట్టర్​ని సూపర్​ యాప్​గా మార్చబోతున్నట్టు వెల్లడించారు సీఈవో లిండా యుక్కరినో. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు వివరాలు వెల్లడించారు. వీడియో కాలింగ్​ తో పాటు మరికొన్ని కొత్త ఫీచర్లను త్వరలోనే తీసుకురాబోతున్నట్టు తెలిపారు ఎక్స్​ కంపెనీ సీఈవో లిండా..

– వెబ్​ డెస్క్​, ఆంధ్రప్రభ

ఇప్పటి వరకు సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు.. విద్యావేత్తలు.. స్పోర్ట్స్ పర్సన్స్.. దాదాపు ప్రతి ఒక్కరూ తమ వాణి వినిపించే వేదికగా ట్విట్టర్ ఉండేది. కానీ, దీన్ని సూపర్ యాప్‌గా మార్చేందుకు ‘ఎక్స్’ మేనేజ్‌మెంట్ చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఓ ఇంటర్వ్యూలో ఎక్స్ కార్పొరేషన్ (ట్విట్ట‌ర్‌) సీఈఓ లిండా యకారినో ఈ సంగతి చెప్పారు. ఎక్స్ ప్లాట్‌ఫామ్ మీద ఇతరులకు ఫోన్ నంబర్ ఇవ్వకుండానే వీడియో చాట్ చేయొచ్చునని.. ఈ ఫీచర్ త్వరలో అందుబాటులోకి తేనున్న‌ట్టు వెల్ల‌డించారు. లాంగ్ ఫామ్ వీడియోలు, క్రియేటర్ సబ్ స్క్రిప్షన్ తోపాటు భవిష్యత్‌లో డిజిటల్ పేమెంట్స్‌ ఫీచర్లు తీసుకొచ్చే అవకాశం ఉందన్నారు.

- Advertisement -

ఇతరుల ప్రొఫైల్స్ మీద యూజర్లు తమ పోస్ట్‌లు చెక్ చేసుకునేందుకు ప‌ర్మిష‌న్‌ ఇచ్చే ఫీచర్ కూడా తీసుకొస్తున్నట్లు ఎక్స్ సీఈవో లిండా తెలిపారు. పెయిడ్ సబ్‌స్క్రైబర్లు తమ ఖాతాలపై చెక్ మార్క్స్ దాచుకోవచ్చు. ఎలన్ మస్క్.. చైనాలో వీ-చాట్ మాదిరిగా ‘సూపర్ యాప్’గా ట్విట్టర్ (ఎక్స్)ను రూపుదిద్దాలని కోరుతున్నార‌ని లిండా వెల్ల‌డించారు. కాగా, శాన్ ఫ్రాన్సిస్కోలోని ట్విట్టర్ హెడ్ క్వార్టర్స్‌లోని వస్తువులను ఎలన్ మస్క్.. వేలానికి పెట్టారు. ట్విట్టర్ జర్నీని తెలిపేందుకు ఆఫీసులో ఏర్పాటు చేసిన కాఫీ టేబుల్స్, భారీ పక్షి పంజరాలు, వైరలైన ఆయిల్ పెయింటింగ్స్, డీజే బూత్ తదితర 584 వస్తువులు వేలంలో పెట్టారు. వీటి ప్రారంభ ధర 24 డాలర్లుగా నిర్ణయించాడు ఎలన్ మస్క్.. వచ్చేనెల 12-14 తేదీల మధ్య వీటి వేలం జరుగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement