Saturday, April 20, 2024

బ‌ద్ధ‌ల‌యిన అగ్నిప‌ర్వ‌తం – ముందుకొస్తున్న స‌ముద్రాలు – భ‌యాందోళ‌న‌లో ప్ర‌జ‌లు

టోంగా వ‌ద్ద అగ్నిప‌ర్వ‌తం బ‌ద్ధ‌ల‌యిన సంగ‌తి తెలిసిందే. ఈ మేర‌కు సునామి హెచ్చ‌రిక‌ల‌ను జారీ చేశారు అధికారులు. దాంతో టోంగాతో పాటు అమెరిక‌న్ స‌మోవా, న్యూజిలాండ్, ఫిజీ, వ‌నువాటు,చిలీ, ఆస్ట్రేలియాల‌కి సునామీ హెచ్చ‌రిక‌లు జారీ అయ్యాయి. కాగా నాలుగు అడుగుల ఎత్తుతో అల‌లు ఎగ‌సిప‌డ‌గా, టోంగా రాజ‌ధాని నుకువాలోఫా ప్ర‌జ‌లు భ‌యాందోళ‌నికి గుర‌య్యారు. భారీ శబ్ధంతో భూమీ కంపించడంతో పాటు సముద్రపు నీరు నగరంలోకి చొచ్చుకుని వచ్చిందని ఆస్ట్రేలియా బ్యూరో ఆఫ్‌ మెటియోరాలజీ ప్రకటించింది. టోంగా రాజు ప్యాలెస్‌ నుంచి ఇప్పటికే సురకక్షిత ప్రాంతానికి తరలిపోగా.. తన పౌరులను అప్రమత్తంగా ఉండాలంటూ పిలుపు ఇచ్చారు.

నష్టం వివరాలు అందాల్సి ఉంది. మరోవైపు అలలు ఎగసిపడే అవకాశం ఉన్నందున అమెరికా, జపాన్‌, సైతం ఇప్పుడు సునామీ హెచ్చరికలతో అప్రమత్తం అయ్యాయి. జపాన్‌ తీర ప్రాంతం వెంబడి 11 అడుగుల మేర అలలు ఎగసిపడే అవకాశం ఉందని భావిస్తోంది వాతావరణ సంస్థ. ఈ నేపథ్యంలో తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచిస్తోంది. మరోవైపు అమామీ ఒషీమా ద్వీపంలోకి 1.2 మీటర్‌ ఎత్తుతో అలలు ఎగసిపడినట్లు తెలుస్తోంది. అమెరికా, కెనడా పశ్చిమ తీరం వెంట సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. కాలిఫోర్నియా, అలస్కా వెంట చిన్నపాటి వరదల దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. హవాయ్‌ అప్రమత్తం అయ్యింది. ఓరేగావ్‌ తీరం వెంట సముద్రపు అలలు ముందుకు వస్తున్నాయి. ఏ క్ష‌ణాన ఏం జ‌రుగ‌నుందోన‌ని ప్ర‌జ‌లు కంపించిపోతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement