Saturday, May 11, 2024

భీమ్లా నాయ‌క్ కి ‘U/A’ సర్టిఫికెట్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, రానా ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం భీమ్లానాయ‌క్. ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ ని ఇచ్చారు. భీమ్లా నాయక్ చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మరో వారం రోజుల్లో విడుదల కానుండగా, చిత్రబృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏర్పాట్లు చేస్తోంది. ఫిబ్రవరి 21న ప్రీ రిలీజ్ వేడుక ఉంటుందని సమాచారం.సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన భీమ్లా నాయక్ చిత్రంలో పవన్ ఓ పోలీసాఫీసర్ పాత్ర పోషించారు. రానా మెయిన్ విలన్ గా నటించారు. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సంభాషణలు రాశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement