Wednesday, May 1, 2024

జమ్ముకశ్మీర్‌లో ఎన్ కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. శ్రీనగర్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. శ్రీనగర్‌లోని రైనావారి ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారనే సమారంతో స్థానిక పోలీసులతో కలిసి సీఆర్‌పీఎఫ్‌ దళాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో ముష్కరులు కాల్పులు జరిపారు. దీంతో ప్రతిగా భద్రతా బలగాల కాల్పులు జరిగింది. దీంతో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. వారిని లష్కరే తొయిబాకు (LeT) చెందిన స్థానిక ఉగ్రవాదులుగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement