Monday, November 4, 2024

శ్రీవారి స‌ర్వ‌ద‌ర్శ‌నానికి రెండు గంట‌లు-త‌గ్గుతోన్న భక్తుల ర‌ద్దీ

తిరుమ‌ల‌లో శ్రీవారి స‌ర్వ‌ద‌ర్శ‌నానికి రెండు గంట‌ల స‌మ‌యం ప‌డుతుంద‌ని అధికారులు చెప్పారు. రెండు కంపార్టుమెంట్ల‌లో భ‌క్తులు వేచి ఉంటున్నారు..కాగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తుల సంఖ్య తగ్గింది. తిరుమలలో నిన్న శ్రీవారిని 69,848 మంది భక్తులు దర్శించుకోగా 28,716 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.34 కోట్లు వచ్చిందని వివరించారు. 27న 72,758, 28న 73.358 మంది, 29న 89,318 మంది, 30న 90,885 మంది భక్తులు, 31న 74,823 మంది దర్శించుకున్నారని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement