Friday, May 17, 2024

Breaking: గ్యాంగ్ రేప్ కేసులో ట్విస్ట్‌.. పోలీసుల అదుపులో ఎమ్మెల్యే కొడుకు

హైద‌రాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప‌బ్ వ‌ద్ద మైన‌ర్ బాలిక‌ను తీసుకెళ్లి కారులో రేప్ చేసిన కేసులో మ‌రో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో ఎమ్మెల్యే కొడుకు కూడా ఉన్న‌ట్టు హైద‌రాబాద్ సీపీ సీవీ ఆనంద్​ ప్రెస్‌మీట్‌లో వెల్ల‌డించనున్నారు. కాసేపట్లో సీపీ మీడియాతో ఈ కేసుకు సంబంధించి పలు విషయాలు వెల్లడించే అవకాశాలున్నాయి.

ఎమ్మెల్యే కొడుకుపై కేసు న‌మోదు అయిన‌ట్టు తెలుస్తోంది. కాగా, పోలీసుల అదుపులోనే ఎమ్మెల్యే కొడుకు ఉన్న‌ట్టు సమాచారం. బ‌హ‌దూర్‌పురా ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు మొజాంఖాన్‌ని మ‌రో నిందితుడిగా చేర్చి కేసు న‌మోదు చేసిన‌ట్టు పోలీసుల ద్వారా తెలుస్తోంది. అయితే బాధిత బాలిక‌కు నిందితుల ఫొటోలు చూపించి పోలీసులు పలు ఆధారాలు సేకరించినట్టు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement