Sunday, June 23, 2024

TSPSC : నిరుద్యోగులకు గమనిక.. నేటి నుంచి ఓటీఆర్‌లో మార్పులు..

వన్‌ టైం రిజి‌స్ర్టే‌షన్‌ (ఓ‌టీ‌ఆ‌ర్‌)లో మార్పు‌లకు అవ‌కాశం కల్పి‌స్తు‌న్నట్టు టీఎ‌స్‌‌పీ‌ఎస్సీ కార్య‌దర్శి అనితా రామ‌చం‌ద్రన్‌ ఆది‌వారం తెలి‌పారు. సోమ‌వారం మధ్యాహ్నం 2 నుంచి టీఎ‌స్‌‌పీ‌ఎస్సీ వెబ్‌‌సై‌ట్‌లో ఈ అవ‌కాశం అందు‌బా‌టులో ఉంటుం‌దని చెప్పారు. రాష్ర్ట‌పతి ఉత్త‌ర్వుల ప్రకారం రాష్ర్టంలో కొత్త జిల్లాలు, జోన్లు, మల్టీ‌జోన్లు ఏర్పా‌డ్డాయి. దీంతో అభ్య‌ర్థుల స్థాని‌కత మారి‌పో‌యింది.

అంతే‌కా‌కుండా 1– 7త‌ర‌గ‌తు‌లను ప్రమా‌ణి‌కంగా తీసు‌కొని స్థాని‌కు‌డిగా పరి‌గ‌ణి‌స్తారు. ఈ నేప‌థ్యంలో అభ్య‌ర్థులు 1 నుంచి 7వ తర‌గతి వరకు 33 జిల్లాల్లో ఏ జిల్లాలో చది‌వారో పొందు‌ప‌రిస్తే స్థాని‌కత ఆటో‌మె‌టి‌క్‌గా మారు‌తుంది. దీంట్లో భాగంగా గతంలో దర‌ఖాస్తు చేసు‌కున్న వారు మార్పులు చేసు‌కో‌వ‌డంతో పాటు, నూత‌నంగా దర‌ఖాస్తు చేసు‌కోవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement