Sunday, May 5, 2024

TS లాసెట్‌, పీజీ లా సెట్ ఫ‌లితాలు రిలీజ్‌.. వెల్ల‌డించిన ఉన్న‌త‌ విద్యామండలి చైర్మ‌న్ లింబాద్రి

తెలంగాణ లాసెట్‌, పీజీ లాసెట్‌ ఫలితాలు ఇవ్వాల (బుధవారం) విడుదలయ్యాయి. తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్‌, ప్రొఫెసర్‌ ఆర్‌ ఆర్‌ లింబాద్రి లాసెట్‌, పీజీలాసెట్‌ ఫలితాలు ప్రకటించారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులు https://lawcet.tsche.ac.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని ఆయ‌న తెలిపారు. మూడేళ్ల లా సెట్‌లో 74.76 శాతం, ఐదేళ్ల లా సెట్‌లో 68.57 శాతం మంది ఉత్తీర్ణత సాధించిన‌ట్టు చెప్పారు.

కాగా, పీజీ లా సెట్‌లో 91.10శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది జులై 21, 22 తేదీల్లో లాసెట్‌, పీజీ లాసెట్‌ పరీక్షలు జ‌రిగాయి. 35,538 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకోగా.. ఇందులో 28,921 మంది ప్రవేశ పరీక్షలకు హాజరయ్యారు. ఫ‌లితాల వెల్ల‌డి కార్యక్రమంలో వైస్ చైర్మన్ వెంకటరమణ, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్‌ల‌ర్ రవీందర్ యాదవ్, లా సెట్ కన్వీనర్.. జీబీరెడ్డి, ఉన్నత విద్యా మండలి సెక్రెటరీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement