Wednesday, April 17, 2024

TS – ఆవుల కొనుగోలులో రూ. 3 కోట్లు స్వాహా …. పశుసంవర్ధక శాఖలో మరో స్కాం

తెలంగాణ పశుసంవర్ధక శాఖలో రోజుకు స్కామ్ బయటపడుతోంది. మొన్న గొర్రెల కుంభ‌కోణం బ‌య‌ట‌కు రాగా, తాజాగా మరో స్కామ్ వెలుగుచూసింది. ఆవుల కొనుగోలులో దాదాపు 3 కోట్ల రూపాయల నిధులను కాంట్రాక్టర్లు, పశుసంవర్ధక శాఖ అధికారులు తమ బినామీ ఖాతాలోకి మళ్లించినట్లు గుర్తించారు. ఆవుల కొనుగోలు అక్రమాలపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. నిధులు స్వాహా అయిన‌ట్లు గుర్తించిన అధికారులు సంబందిత సిబ్బందిపై కేసులు న‌మోదు చేసేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు..

బినామీ అకౌంట్లకు మారిన డబ్బు..

ప్రభుత్వ నిధుల నుంచి 8.5 కోట్ల రూపాయలను గత ప్రభుత్వం విడుదల చేసింది.. ఆవులు అమ్మిన వ్యాపారులకు మాత్రం 4 కోట్ల రూపాయలు మాత్రమే అకౌంట్లో జమయ్యాయి.. మిగిలిన 4.5 కోట్ల రూపాయల బినామీ అకౌంట్స్ కి ముఠా సభ్యులు మళ్ళించారు. రైతులు నిలదీయడంతో ముఠా సభ్యులు కోటిన్నర రూపాయలను తిరిగి ఇచ్చారు. తమకు ఇంకా మూడు కోట్ల రూపాయలు పశుసంవర్ధక శాఖ నుంచి రావాలంటూ ఏసీబీ అధికారులకు పుంగనూరు ఆవుల రైతులు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసును ఏసీబీ అధికారులు ద‌ర్యాప్తు చేశారు.. బినామీ పేర్ల‌తో బ్యాంకుల నుంచి న‌గ‌దు విత్ డ్రా చేసిన‌ట్లు తేల్చారు.. బినామీలను సైతం గుర్తించారు.. అలాగే ఈ స్కామ్ లో ప‌శుసంవ‌ర్ధ‌క శాఖాలోని ప‌లువురు సిబ్బంది హ‌స్తం ఉన్న‌ట్లు గుర్తించారు.. దీంతో వారంద‌రిపై కేసులు న‌మోదు చేసి అరెస్ట్ కు రంగం సిద్ధం చేసుకుంటున్నారు ఎసిబి అధికారులు .

Advertisement

తాజా వార్తలు

Advertisement