Saturday, May 4, 2024

తెలంగాణ భ‌వ‌న్ లో ప్రారంభ‌మైన టీఆర్ ఎస్ విస్తృతస్థాయి సమావేశం

నేడు సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లే అవ‌కాశాలు ఉన్నాయి. ఈ మేర‌కు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీతో పాటు ప‌లువురు కేంద్ర మంత్రుల‌ను క‌లిసేందుకు అపాయింట్ మెంట్ కోరిన‌ట్లు స‌మాచారం. కాగా తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ శాసనసభా పక్ష విస్తృతస్థాయి సమావేశం ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో జ‌రుగుతోన్న ఈ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశం ఉంది. ఈ స‌మావేశంలో టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, జడ్పీ ఛైర్మన్లు, రైతుబంధు సమితుల జిల్లాల‌ అధ్యక్షులు, కార్పొరేషన్ల ఛైర్మన్లు పాల్గొంటున్నారు. యాసంగి ధాన్యం కొనుగోళ్ల కోసం కేంద్ర ప్ర‌భుత్వంపై పోరాటానికి కార్యాచరణ ఖరారు చేయనున్నారు. అలాగే ప‌లు అంశాల‌పై పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఒక‌వేళ కేంద్ర ప్ర‌భుత్వం నుంచి స్పంద‌న రాక‌పోతే ఢిల్లీలోనే ధర్నా చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement