Friday, May 3, 2024

Flash: మంచు మనోజ్ కారును ఆపిన ట్రాఫిక్ పోలీసులు

హైదరాబాద్‌లో ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడిపేవారిపై ట్రాఫిక్‌ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖులు, సినీ సెలిబ్రిటీలు నుంచి సామాన్యుల వరకు అందరిపై కొరడా ఝుళిపిస్తున్నారు. ఇప్పటికే సినీ హీరోలు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, అల్లు అర్జున్ తదితరుల కార్లకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ ను తొలగించి ఫైన్ విధించిన సంగతి తెలిసిందే. తాజాగా హీరో మంచు మనోజ్ కు జరిమానా విధించారు. టోలిచౌకిలో ట్రాఫిక్‌ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సందర్భంగా హీరో మంచు మనోజ్ కారును ఆపారు. మనోజ్‌ నడుపుతున్న కారు అద్దాలకు బ్లాక్ ఫిలింను గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా బ్లాక్‌ ఫిలిం ఉన్నందుకుగాను రూ.700 చలాన్ విధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement