Wednesday, February 28, 2024

Peopls Police: ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదే.. పోలీసులంటే నిజంగా ఇట్ల‌నే ఉండాలే!

గద్వాల్ నుండి హైదరాబాద్ కు ఉల్లిగ‌డ్డ‌ల‌ లోడుతో వెళ్తున‌ డీసీఎం మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోని భూత్పూరు వ‌ద్ద బోల్తాప‌డింది. ఓ రైతు తన పంటను అమ్మడానికి తీసుకెళ్తున‌ సమయంలో శేర్ పల్లి (బీ )వద్ద ఈ ఘ‌ట‌న జ‌రిగింది. సమాచారం అందుకున్న భూత్పూర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి వచ్చి రైతు బాధ‌ను చూసి చలించిపోయారు. రైతుకు తమ సాయన్ని అందించారు.

డీసీఎంను స‌రిచేసి, ఉల్లిగ‌డ్డ‌ల బ‌స్తాల‌ను డీసీఎంలోకి ఎక్కించేందుకు సాయం చేశారు. స్వ‌యంగా పోలీసులే బ‌స్తాలు మోయ‌డం ఇక్క‌డ చెప్పుకోద‌గ్గ విష‌యం. ఫ్రెండ్లీ పోలీసు అన్న మాట‌ల‌ను అక్ష‌రాల నిరూపించారు భూత్పూర్ పోలీసులు. ఇప్పుడు ఈ ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. పోలీసులంటే ఇట్లుండాలే అని చాలామంది లైక్ చేస్తూ, పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement