Thursday, February 22, 2024

రైల్వే ట్రాక్ మాయం.. ఇద్దరిపై వేటు

రైల్వేట్రాక్ ని మాయం చేసింది ఓ దొంగల ముఠా..ఈ సంఘటన బీహార్ లో చోటుచేసుకుంది. కాపలాగా ఉన్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్ పీఎఫ్) సిబ్బంది చేతివాటం దొంగలకు కలిసొచ్చింది. మొత్తంగా అక్కడొక ట్రాక్ ఉండేదనే ఆనవాళ్లు కూడా లేకుండా మాయం చేశారు. తాజాగా ఈ విషయం బయటపడడంతో ఉన్నతాధికారులు స్పందించారు. అక్కడి సిబ్బందిలో ఇద్దరిపై అప్పటికప్పుడు వేటు వేశారు. డిపార్ట్ మెంటల్ ఎంక్వైరీకి ఆదేశించి, నివేదిక రాగానే తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.మధుబని జిల్లాలోని బెలాహీలో లోహత్ షుగర్ మిల్ ఉంది. ఈ ఫ్యాక్టరీకి రవాణా సదుపాయం కోసం అప్పట్లోనే రైల్వే శాఖ ఓ ట్రాక్ ను వేసింది. అయితే, ఈ మిల్ మూతపడడంతో ఆ ట్రాక్ నిరుపయోగంగా మారింది. దాదాపు రెండు దశాబ్దాలుగా ఈ ట్రాక్ పై రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో రైల్వే అధికారులు కూడా ఆ ట్రాక్ ను పట్టించుకోవడం లేదు. నిరుపయోగంగా మారిన ట్రాక్ ను రైల్వే శాఖ నిబంధనల ప్రకారం టెండర్లు పిలిచి, స్క్రాప్ కింద అమ్మేయాలి. కానీ ఈ ట్రాక్ విషయంలో అలాంటివేవీ జరగలేదు. ట్రాక్ మాత్రం మాయమైంది. ప్రాథమిక విచారణలో కొంతమంది ఓ ముఠాగా ఏర్పడి, ఆర్ పీఎఫ్ సిబ్బంది సహకారంతో ట్రాక్ ను అమ్మేసి సొమ్ము చేసుకున్నారని తేలింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement