Sunday, April 28, 2024

తెలంగాణలో న్యూ ఇయర్ వేడుకలపై హైకోర్టులో పిల్.. రేపు విచారణ

న్యూ ఇయర్ వేడుకలకు హైకోర్టు ఇచ్చిన ఆంక్షలను తెలంగాణ ప్రభుత్వం బేఖాతరు చేయడంపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణలో న్యూ ఇయర్ వేడుకలపై హైకోర్టులో పిల్ దాఖలైంది. హైకోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం బేఖాతరు చేస్తోందని పిటిషన్ పేర్కొన్నారు. ఒమిక్రాన్, కరోనా పరిస్థితులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాలని కోరారు. ప్యాండమిక్, ఎపిడెమిక్, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్‌ని రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని తెలిపారు.

ప్రభుత్వం ఓమిక్రాన్‌ను కట్టడి చేయకుండా న్యూ ఇయర్ వేడుకలను అనుమతి ఇచ్చిందని చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా 62 ఒమైక్రాన్ కేసులు నమోదయ్యాయని పిటిషనర్ తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకుని న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు పెట్టాలని పిటిషనర్ కోరారు. అయితే ఈ విషయంపై రేపు హై కోర్టు మరోసారి విచారించనుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement