Friday, May 3, 2024

Wedding Gift: కొత్త జంటకు పెట్రోల్‌, డీజిల్‌ బహుమతి

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ భారీగా పెరిగింది. దీంతో ప్రజలు తమ వాహనాలను బయటకు తీయాలంటేనే భయపడిపోతున్నారు. గడిచిన 16 రోజుల్లో ఏకంగా 14 సార్లు చమరు ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఓ వివాహ వేడుకలో నూతన వధూవరులకు వారి స్నేహితులు లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌ బహుమతిగా ఇచ్చారు. కొత్తగా పెళ్లయిన జంటకు పెళ్లి రోజున ఓ లీటర్ పెట్రోల్, డీజిల్‌ను బహుమతిగా ఇస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

తమిళనాడులోని చంగల్‌పట్టు జిల్లా చెయ్యూరులో గిరీశ్‌ కుమార్‌, కీర్తన జంట వివాహ వేడుక జరుగుతున్నది. అంతా వధూవరులను ఆశీర్వదిస్తున్నారు. ఈ క్రమంలో వారి స్నేహితులు ఓ కవర్‌లో నుంచి రెండు లీటర్‌ బాటిళ్లు తీశారు. పెట్రోల్‌, డీజిల్‌తో ఉన్న ఆ బాటిళ్లను ఇద్దరి చేతిలో పెట్టి వారిని ఆశ్చర్యపరిచారు. తమిళనాడులో గత 15 రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తొమ్మిది రూపాయలకు పైగా పెరిగాయి. పెట్రోల్ రూ.110.85,డీజిల్ రూ 100.94 లీటరుకు చేరింది.  కాగా, గతంలో ఉల్లిపాయల ధరలు పెరిగిన సందర్భంలోనూ కొత్త జంటలకు ఉల్లిపాయలను గిఫ్ట్ గా ఇచ్చన సందర్భాలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement