Saturday, May 11, 2024

Spl Story: త‌గ్గేదేలే.. సినిమా స్టైల్‌ పోజుల‌తో బొజ్జ గ‌ణ‌ప‌య్య హ‌ల్‌చ‌ల్‌!

లంబోదరుడు, మూషిక వాహ‌నుడు అయిన గ‌ణ‌నాథుడు కూడా ‘‘నీ య‌వ్వ‌ త‌గ్గేదేలే’’ అంటున్నాడు. సినిమా స్టైల్ గ‌ణేశుడి ప్ర‌తిమ‌లు, విగ్ర‌హాలు ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల‌తో పాటు దేశ వ్యాప్తంగా హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఈ మ‌ధ్య వ‌చ్చిన కొన్ని సినిమాల్లోని హీరో రోల్స్‌లో బొజ్జ గ‌ణ‌ప‌య్య ఆక‌ట్టుకుంటున్నాడు. అందులో పుష్ప‌రాజ్ గ‌ణ‌ప‌య్య‌, విల్లు ఎక్కుపెట్టిన అల్లూరు సీతారామాజు గణేశుడి ప్రతిమలు, విగ్ర‌హాలు అయితే సోష‌ల్ మీడియాలోనూ తెగ చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

– డిజిట‌ల్ మీడియా, ఆంధ్ర‌ప్ర‌భ‌

టాలీవుడ్ , బాలీవుడ్ సహా దేశవ్యాప్తంగా తెలుగు సినిమాలు ఈ ఏడాది ఓ ఊపు ఊపేశాయి. అట్లాంటి సినిమాల్లోని క్యారెక్ట‌ర్స్ గురించి ఇప్ప‌టికీ చాలామంది చ‌ర్చించుకుని న‌వ్వుకుంటారు. అయితే.. గణేశ్ నవరాత్రుల సందర్భంగా ప‌లువురు హీరోల రోల్స్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. దేశవ్యాప్తంగా రికార్డులతో దుమ్ము రేపిన పుష్ప, ఆర్ఆర్ఆర్ సినిమాల్లోని హీరో పాత్రలతో వినాయక విగ్రహాలు రూపొందాయి.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా పలుచోట్ల అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ పాత్రలకు సంబంధించిన ఫోజులతో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటికి సంబంధించిన కొన్ని ఫొటోలను ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా సైట్లలో పెట్టడంతో అవి విపరీతంగా వైరల్ గా మారాయి.

పుష్ప సినిమాలో పుష్పరాజ్ పాత్ర పోషించిన అల్లు అర్జున్ డైలాగ్ ‘తగ్గేదేలే..’. పలు చోట్ల ఇదే పుష్పరాజ్ పాత్ర ఆహార్యంలో.. అదే జుత్తు, వస్త్రాలు, ఇతర లక్షణాలతో.. తగ్గేదేలే అంటూ గడ్డంపై చేయి పెట్టినట్టుగా ఉన్న గణేశుడి ప్ర‌తిమ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ పోషించిన సీతారామరాజు పాత్రకు సంబంధించి వివిధ రూపాల్లోని గణేశ విగ్రహాలు అలరిస్తున్నాయి. సినిమా క్లైమాక్స్ లో రామ్ చరణ్ పరుగెడుతూ ఉన్నప్పటి తరహాలో బాణాన్ని ఎక్కుపెడుతున్నట్టుగానే రూపొందించిన గణేశ విగ్ర‌హాలు అంద‌రినీ ఆకట్టుకుంటున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement